ఈ రోజుల్లో కరెంటు బిల్లులు బాగా పెరిగిపోతున్న సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. కరెంటును ఆదా చేసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఐతే.. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసినా, ప్లగ్ తియ్యకపోతే కరెంట్ ఖర్చవుతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకుందాం.
టెక్నాలజీ అప్‌గ్రేడ్ కారణంగా చాలా ఎలక్ట్రిక్ పరికరాలకు రిమోట్లు ఉన్నాయి. టీవీ, ఫ్యాన్, ఏసీ, లైట్స్ ఇలా ప్రతీ దానికీ రిమోట్ లేదా మొబైల్ యాప్‌తో కనెక్టివిటీ ఉంటోంది. అందువల్ల వాటిని స్విచ్ ఆఫ్ చేసేందుకు రిమోట్ వాడుతున్నారు. ఐతే.. నిపుణుల ప్రకారం.. రిమోట్‌తో ఆపినా.. కరెంటు సప్లై పూర్తిగా ఆగిపోదు. రిమోట్‌తో ఆఫ్ చేసినా.. కొంత కరెంటును ఆ గాడ్జెట్స్ వాడుకుంటూ ఉంటాయి. అవి స్లీప్‌మోడ్ లేదా స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్తాయే తప్ప.. పూర్తిగా ఆఫ్ అవ్వవు. అందుకే.. తిరిగి రిమోట్‌తో ఆన్ చేసినప్పుడు అవి ఆన్ అవుతాయి.
కరెంటును సేవ్ చెయ్యాలంటే.. డైరెక్టుగా స్విచ్ ఆఫ్ చెయ్యడమే బెటర్ అంటున్నారు నిపుణులు. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే పూర్తిగా ఎలక్ట్రిసిటీ ప్రవాహం ఆగుతుందని చెబుతున్నారు. ఐతే.. స్విచ్ ఆఫ్ చేశాక.. ప్లగ్‌లు తీసేయాల్సిన పని లేదు. ప్లగ్‌లు ఉన్నా.. కరెంటు సప్లై అవ్వదు. ఐతే.. వేరే ఊరు వెళ్లేవారు, ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు.. షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా.. ప్లగ్‌లు కూడా తీసేయడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.