మనందరం వాతావరణంలో తేమ శాతం పెరిగిందనీ, తగ్గిందనీ వచ్చే వార్తలు వింటుంటాం. అప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి. అసలు ఈ తేమ అంటే ఏంటి? నీటినే మనం తేమ అంటున్నామా? అనే ప్రశ్నలు కలుగుతాయి. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి నీటి మరో రూపమే తేమ. ఈ నీరు.. వేడెక్కినప్పుడు గ్యాస్ లాగా మారుతుంది. దాన్నే మనం నీటి ఆవిరి అంటాం. దాన్నే తేమ అని కూడా అంటాం. ఈ తేమ మనకు కనిపించదు. ఎందుకంటే.. నీటి అణువులు చాలా చిన్నగా ఉంటాయి. నీరు, గ్యాస్‌గా మారినప్పుడు ఈ అణువుల మధ్య దూరం పెరుగుతుంది. అదే అణువులు.. తిరిగి దగ్గరైనప్పుడు.. నీటి రూపంలోకి మారతాయి. అప్పుడు మనం వాటిని చూడగలం. ఒక నీటి చుక్కలో 1.5 సెక్స్టిలియన్ అణువులు ఉంటాయి. ఒక సెక్స్టిలియన్ అంటే.. ఈ నంబర్‌కి 1 పక్కన 21 జీరోలు ఉంటాయి. ఈ లెక్కన 1.5 సెక్స్టిలియన్ అణువులంటే ఎంత ఎక్కువో అంచనాకు అందదు.
మనకు కనిపించే మేఘాలన్నీ నీరే. సూర్యుడి ఉష్ణోగ్రత వల్ల.. నీరు వేడెక్కి.. ఆవిరిగా మారాక.. ఆ అణువులు.. విడివిడిగా అయిపోతూ.. వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటాయి. వేడి తగ్గుతున్నప్పుడు.. అవే అణువులు దగ్గరవుతూ.. ఆకాశంలో మేఘాల రూపంలో ఉంటాయి. వేడి మరింత తగ్గే కొద్దీ.. మేఘాల్లో నీటి అణువుల మధ్య దూరం బాగా తగ్గిపోతుంది. అప్పుడు అణువులన్నీ దగ్గరవుతుంటే.. వాటికి నీటి రూపం వస్తుంది. నీరుగా మారగానే.. భూమ్యాకర్షణ వల్ల ఆ నీరు... భూమిపై పడుతుంది. దాన్నే మనం వర్షం అంటున్నాం.
వాతావరణంలో నీటి ఆవిరి.. అదే.. తేమ ఎక్కువగా ఉంటే.. ఆ సమయంలో.. ఎండ పడకుండా మేఘాలు సూర్యుడికి అడ్డుగా వస్తే.. క్రమంగా వాతావరణంలో వేడి తగ్గుతుంది. ఫలితంగా నీటి ఆవిరి మేఘాలతో కలుస్తుంది. దాంతో మేఘాల రూపంలో ఉన్న అణువులు.. మరింత దగ్గరకు చేరి పూర్తి స్థాయి నీరుగా మారుతాయి. అందువల్ల వర్షం పడుతుంది.
వాతావరణ అధికారులు.. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అని చెబితే.. అప్పుడు వర్షం పడే అవకాశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. అదే సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు కూడా ఉండాలి. అప్పుడే వాన పడగలదు. గాలిలో తేమ 80 శాతానికి పైగా ఉంటే చిరుజల్లులు కురుస్తాయి. 90 శాతానికి పైగా ఉంటే, ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. 100 శాతానికి చేరినప్పుడు భారీ వర్షం పడుతుంది. ఇలా తేమ శాతం పెరిగేకొద్దీ.. మనకు వర్షం, చల్లదనం పెరుగుతాయి.
వాతావరణంలో తేమ ఎంత శాతం ఉంది అనేది.. ఉష్ణోగ్రతతోపాటూ.. గాలి వల్ల కూడా డిసైడ్ అవుతుంది. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు.. గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు తేమ కూడా తక్కువగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, గాలిలో తేమ 30 శాతం నుంచి 70 శాతం మధ్య ఉండాలి. 30 శాతం కంటే తక్కువ ఉన్నా, 70 శాతం కంటే ఎక్కువ ఉన్నా.. రకరకాల అనారోగ్యాలు రాగలవు. ఇలా గాలిలో తేమ.. వాతావరణ అంచనాల్లో కీలక అంశంగా ఉంటుంది.