వర్షం పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు రావడం చూస్తుంటాం. ఈ మెరుపు చాలా వేడిగా ఉంటుంది. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడి కంటే.. మెరుపు వేడి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే.. సూర్యుడి ఉపరితలంపై 5వేల 700 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. మెరుపు వేడి ఏకంగా 30వేల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే ఉరుములు, మెరుపులు, పిడుగులతో జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడేటప్పుడు చెట్ల కిందకు వెళ్లకూడదు.
పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ వాటిని కూడా ఎక్కువగా తినకూడదు. పండ్లలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది.. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. దానివల్ల బరువు పెరుగుతారు. హైబీపీ, గుండె జబ్బుల వంటి రాగలవు. అందుకే.. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారాలను తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్, అరటి, మామిడి, ద్రాక్ష, ఖర్జూరాలు, పుచ్చకాయ, ఫిగ్స్, పియర్స్, తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫ్రక్టో్జ్ తక్కువగా ఉండాలంటే, ఇవి అత్యంత తాజాగా ఉన్నప్పుడు తినాలి. అప్పుడు ఫ్రక్టోజ్ కంటే ఫైబర్ ఎక్కువగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పెంగ్విన్లు మనిషి కంటే వేగంగా నడవగలవు. ఎగరలేని ఈ పక్షులు.. అంటార్కిటికాలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో జీవిస్తాయి. ఇవి తమ జీవితకాలంలో సగం కాలం మంచులో, సగం కాలం సముద్రంలో జీవిస్తాయి.
ప్రపంచంలో అతిపెద్ద ముక్కు ఉన్న పక్షి ఆస్ట్రేలియా పెలికాన్ పక్షి. దీని ముక్కు 47 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి ముక్కు కింద పెద్ద సంచి లాంటిది ఉంటుంది. ఇందులో చేపల్ని స్టోర్ చేసి.. తమ పిల్లల కోసం తీసుకెళ్తాయి.
ఆపద సమయంలో చేపలు గుంపుగా వెళ్లడమే కాదు.. క్యూ పద్ధతి కూడా పాటిస్తాయని సైంటిస్టులు కనుక్కున్నారు. క్యూ పద్ధతి వల్ల చేపలు వేగంగా వెళ్లడమే కాదు.. ఎలాంటి తొక్కిసలాటలూ జరగట్లేదు. ఎమర్జెన్సీ టైంలో ఇలా చేపలు సోషల్ రూల్స్ పాటించడం గొప్ప లక్షణం అంటున్న సైంటిస్టులు.. మనుషుల్లో ఇది కనిపించట్లేదని తెలిపారు.
దక్షిణ ధృవం నుంచి చందమామను చూస్తే.. అది తలకిందులుగా కనిపిస్తుంది. అంటే.. చందమామపై ఒక మనిషి నిలబడితే.. భూమిపై ఉత్తర ధృవం నుంచి చూసినప్పుడు.. ఆ మనిషి మామూలుగా నిలబడినట్లుగానే కనిపిస్తారు. అదే దక్షిణ ధృవం నుంచి ఆ మనిషిని చూస్తే.. తలకిందులుగా కనిపిస్తారు. అక్కడ చందమామ రివర్సులో ఉంటుంది. మూన్‌పై ఉండే మచ్చలు.. దక్షిణ ధృవం నుంచి చూసినప్పుడు దాదాపు ర్యాబిట్ ఆకారంలో కనిపిస్తాయి.
వర్షం వచ్చే ఒక రోజు ముందే తాబేళ్లు.. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లిపోతాయి. అలాగే.. సముద్ర పక్షులు తీరాన్ని చేరుకొని సైలెంట్ అయిపోతాయి. మామూలు పక్షులు.. నేలకు దగ్గరగా ఎగురుతాయి. ఇవన్నీ గమనిస్తే.. మనం కూడా వర్షం వస్తోందని అర్థం చేసుకోవచ్చు. ఈ భూమిపై ప్రతి నిమిషానికీ వంద కోట్ల టన్నుల వర్షం పడుతోంది.