Digital Art: ఈ రోజుల్లో డిజిటల్ ఆర్ట్‌కి ఆదరణ బాగా పెరుగుతోంది. ఎంతో మంది టాలెంటెడ్ డిజిటల్ ఆర్టిస్టులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. (image credit - instagram - zakeazy) |
ఫ్రాన్స్‌కి చెందిన డిజిటల్ ఆర్టిస్ట్ జాక్ ఈజీ (zakeazy)... మిగతా కళాకారులలా కాకుండా కాస్త భిన్నమైన ఆర్టును చూపిస్తున్నాడు. (image credit - instagram - zakeazy) |
రకరకాల ఫొటోలను మిక్స్ చేసి... సర్రియల్ ఇమేజెస్ సృష్టిస్తున్నాడు. నిజమేనేమో అనిపించేలా ఉంటున్నాయి అవి. (image credit - instagram - zakeazy) |
జాక్ తన డిజిటల్ ఆర్టులో... జంతువులు, భవనాలు, ప్రకృతిని మిక్స్ చేస్తున్నాడు. అందువల్ల అవి సహజమైనవిలా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. (image credit - instagram - zakeazy) |
ఫాంటసీ ఆర్ట్ తయారుచెయ్యాలంటే చాలా కష్టం. ఆ స్థాయిలో ఊహించడం సవాలే. జాక్ ఈజీ మాత్రం ఎంతో ఈజీగా ఇది చేసి చూపిస్తున్నాడు. (image credit - instagram - zakeazy) |
జాక్ ఫొటోలన్నీ మనల్ని మరో ప్రపంచానికి తీసుకుపోతాయి. అందులో భవనాలు, ప్రకృతి వల్ల అది మనం ఇదివరకు చూసినదానిలాగానే ఉంటుంది కానీ కొత్తగా అనిపిస్తుది. (image credit - instagram - zakeazy) |
"నేను కళను ప్రేమిస్తాను. క్రియేషన్ అంటే ఇష్టం. ఆర్కిటెక్చర్ అంటే ప్రాణం" అని జాక్ వివరించాడు. (image credit - instagram - zakeazy) |
"నేను పిల్లాడిగా ఉన్నప్పుడు మా నాన్న నాకు ఇది నేర్పారు. నాన్నతో కలిసి నేను కూడా ఊహాతీతమైనవి గీయడం ప్రారంభించాను" అని తన కథ చెప్పాడు. (image credit - instagram - zakeazy) |
పదేళ్ల కిందట ఫొటోషాప్ నేర్చుకున్న జాక్... గ్రాఫిక్ డిజైనర్ అయ్యాడు. అలా నేర్చుకున్న అనుభవంతో... 2019లో డిజిటల్ ఆర్టిస్టుగా మారాడు. (image credit - instagram - zakeazy) |
డిజిటల్ ఆర్ట్ అనేది ఊహల్లోంచీ రావాలి కాబట్టి... టెన్షన్లతో అది సాధ్యం కాదు. అందుకే జాక్... ఒక్కో ఫొటోకీ నెలల టైమ్ తీసుకుంటాడు. (image credit - instagram - zakeazy) |
రెండున్నరేళ్లుగా జాక్ సృష్టించినవి 55 ఫొటోలు మాత్రమే. దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు... డిజిటల్ ఆర్ట్ అనేది ఎంత ఓపికతో వేయాల్సి ఉంటుందో. (image credit - instagram - zakeazy) |
ఆర్టిస్టులు ఎంత కష్టపడినా... దాన్ని ప్రజలు చూసి మెచ్చుకున్నప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతారు. జాక్ విషయంలోనూ అదే జరుగుతోంది. (image credit - instagram - zakeazy) |
జాక్ ఆర్టులో కొంత మిస్టరీ కూడా ఉంటుంది. ఎక్కడ ఏ జంతువులు ఉన్నాయో మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా అంచనాలకు మించి ఆర్ట్ ఉంటుంది. (image credit - instagram - zakeazy) |
ప్రకృతిని చూస్తూ పెరిగిన జాక్... అదే ప్రకృతిని ప్రేరణగా తీసుకున్నాడు. అందుకే అతని డిజిటల్ ఆర్టులో నేచర్ అడుగడుగునా కనిపిస్తుంది. (image credit - instagram - zakeazy) |
జాక్ చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాడు. అక్కడి కల్చర్, స్టైల్, అక్కడి ప్రజల జీవన విధానం... అవన్నీ చూసి... వాటిని తన డిజిటల్ ఆర్టులో మిక్స్ చేస్తున్నాడు. (image credit - instagram - zakeazy) |
ఇలా తెరవెనక ఎంతో కృషి చేస్తున్నాడు కాబట్టే... జాక్ డిజిటల్ ప్రపంచం అత్యద్భుతంగా కనిపిస్తోంది. (image credit - instagram - zakeazy) |
జాక్ ఊహా ప్రపంచం. (image credit - instagram - zakeazy) |