భారతీయ రైల్వేలోని చాలా రైళ్లు, మెట్రోరైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లూ ఇవన్నీ ఎలక్ట్రిక్‌వే.. వీటిలో చాలా భాగం ఐరన్ తోనే తయారవుతుంది. అలాంటప్పుడు వీటిలో ప్రయాణించేవారికి కరెంటు షాక్ కొట్టాలి కదా? అలా ఎందుకు జరగట్లేదు? ఈ రైళ్లు మనకు సేఫేనా? తెలుసుకుందాం.
కరెంటులో ధనావేశం, రుణావేశం ఉంటుంది. వాటినే ప్లస్, మైనస్‌గా చెప్పుకుంటాం. ఇవి రెండూ, రెండు పోల్స్ లాంటివి. ఎప్పుడైనా కరెంటు ప్రవహించాలంటే.. అది తప్పనిసరిగా ఈ రెండు పోల్స్‌నీ టచ్ చెయ్యాలి. మనకు షాక్ కొట్టాలంటే.. మన బాడీ.. కొంత దూరంలో ఉన్న ప్లస్, మైనస్‌కి కనెక్ట్ అవ్వాలి. అంటే మనం ఒక చేత్తో ప్లస్ పోల్‌ని టచ్ చేస్తే, మరో చేత్తో లేదా కాలితో మైనస్ పోల్‌ని ముట్టుకోవాలి. అప్పుడు మాత్రమే కరెంటు మన బాడీలో ప్రవహిస్తుంది.
ఒక్కోసారి మనం కరెంటు తీగను ముట్టుకున్నప్పుడు మనకు షాక్ కొడుతుంది. ఎందుకంటే.. భూమిపై ఉండే వాతావరణం ప్లస్ పోల్ లాంటిది. భూమి ఉపరితలం మైనస్ పోల్ లాంటిది. మనం కరెంటు తీగను ముట్టుకున్నప్పుడు.. మనకు ప్లస్ టచ్ అవుతుంది. అదే సమయంలో మన కాళ్లు భూమిని తాకి ఉంటే, అది మైనస్ అవుతుంది. అంటే.. కరెంటుకి ప్లస్, మైనస్ రెండూ దొరికినట్లే.. దాంతో ప్రవాహం సాధ్యమవుతుంది. అప్పుడు మన శరీరం నుంచి కరెంటు ప్రవహిస్తుంది. దాంతో మనకు షాక్ కొడుతుంది.
ఎలక్ట్రిక్ ట్రైన్‌లో ఇంజిన్‌ని మాత్రమే ఎలక్ట్రిక్ వైర్లకు కనెక్ట్ చేస్తారు. బోగీలను కనెక్ట్ చెయ్యరు. ఐతే.. ఇంజిన్‌కీ, బోగీలకూ మధ్య లింక్ ఉంటుంది కాబట్టి, బోగీల్లో కూడా కరెంటు ప్రవహిస్తుంది కదా అనే డౌట్ మనకు రావచ్చు. అది నిజమే. బోగీల్లో కూడా కరెంటు ప్రవహించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడో టెక్నిక్ ఉంది. రైలు ఇంజిన్, బోగీలు అన్నింటికీ ప్లస్ మాత్రమే ఉంటుంది. మైనస్ ఉండదు. రైలు పైన ఉండే కరెంటు తీగ.. ప్లస్ అన్నమాట. మైనస్ అనేది భూమి ఉపరితలం. అందువల్ల పై నుంచి వచ్చే కరెంటును డైరెక్టుగా పట్టాల నుంచి భూమికి కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెషిన్ ఉంటుంది. అందువల్ల కరెంటు ప్రవాహం ఆ యంత్రం ద్వారా సాగుతుంది.
కరెంటు ప్రవాహం ఆ మెషిన్ ద్వారానే ఎందుకు వెళ్తుంది? బోగీల వైపు కూడా వెళ్లొచ్చు కదా... అనే మరో డౌట్ మనకు రావచ్చు. ఇక్కడ మరో టెక్నిక్ ఉంది. కరెంట్ ఎప్పుడూ వీలైనంత వేగంగా వెళ్లే మార్గాన్ని వెతుక్కుంటుంది. అంటే.. ప్రవాహంలో ఎలాంటి అవరోధాలూ ఉండకుండా చూసుకుంటుంది. రైల్లోని మెషిన్.. కరెంటును వేగంగా భూమికి చేరేలా చేస్తుంది. ఆ మార్గం కాకుండా మరే మార్గంలో వెళ్లినా ఆలస్యం అవుతుంది. అందువల్ల కరెంటు ఆ యంత్రం ద్వారానే వెళ్తుంది. ఈ కారణంగా రైలులో ఉన్నవారికి కరెంటు పాస్ అవ్వదు. అందుకే ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణించేవారికి షాక్ కొట్టదు.