న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. ఒకప్పుడు లైట్ హౌస్ లాగా పనిచేసేది. దాన్ని 1886లో ఆవిష్కరించిన నెల తర్వాత.. దాని టార్చ్‌ని ఆన్ చేశారు. అప్పటి నుంచి 16 ఏళ్లపాటూ అది లైట్‌హౌస్ లాగా పనిచేసింది. ఆ టార్చ్ రాత్రివేళ 38 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేది.
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో మొత్తం 26 లెటర్స్ ఉంటాయని మనకు తెలుసు. ఐతే.. 1524 వరకూ.. 25 లెటర్సే ఉండేవి. ఆ తర్వాత చివరి లెటర్‌గా Jని యాడ్ చేశారు. అప్పటివరకూ Jకి బదులుగా I లెటర్‌నే వాడేవారు. ఆ తర్వాత J అవసరాన్ని గుర్తించి, దాన్ని యాడ్ చేశారు. ఐతే, J తర్వాత మరే లెటర్‌నీ యాడ్ చెయ్యలేదు.
రొయ్య గుండె దాని తలలో ఉంటుంది. రొయ్యలకు ధమనులు ఉండవు. అందువల్ల వాటి అవయవాలు రక్తంలో తేలుతూ ఉంటాయి.
పందులు ఆకాశంవైపు చూడలేవు. ఎందుకంటే, వాటి మెడ కండరాలు, వెన్నెముక, తల పైకి ఎత్తేందుకు వీలుగా ఉండవు. అందువల్ల పందులు పైకి చూడలేవు.
వేలి ముద్రలు ఎలాగైతే ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయో, నాలిక ముద్రలు కూడా అలా వేర్వేరుగా ఉంటాయి. కవలలకు కూడా టంగ్ ప్రింట్స్ వేరుగానే ఉంటాయి. నాలిక కలర్, షేప్, సర్ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఫోరెన్సిక్ పరీక్షల్లో నాలిక ముద్రలను కూడా పరీక్షిస్తారు.
ప్రతీ సంవత్సరం పిడుగుల వల్ల మనుషుల కంటే జిరాఫీలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. వాటి మరణాల రేటు మనుషుల మరణాల కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంది. వర్షాలు పడే సమయంలో జిరాఫీలు మనలా ఇళ్లలో ఉండే వీలు లేకపోవడం వల్ల, అవి చెట్ల కిందకు వెళ్తున్నాయి. అక్కడే పిడుగులు పడుతుండటం వల్ల చనిపోతున్నాయి. బీబీసీ సైన్స్ ఫోకస్ ఈ విషయాన్ని తెలిపింది.
ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఐతే.. దాని బ్రెయిన్ మాత్రం చాలా చిన్నది. దాని బ్రెయిన్ కంటే, దాని కన్ను పెద్దగా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. భూమిపై ఉన్న ప్రాణుల్లో అతి పెద్ద కళ్లను కలిగినవి ఆస్ట్రిచ్‌లే. ఈ కళ్లు 5 సెంటీమీటర్లు ఉంటాయి. ఇవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరాయి.