మద్యం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది తాగుతుంటారు. దానివల్ల వారికి మత్తు వచ్చి, మైండ్ సరిగా పనిచెయ్యదు. ఎంత మత్తు ఎక్కింది? వదిలేందుకు ఎంత టైమ్ పడుతుంది అనేది వారు ఎంత తాగారు? ఏం తాగారు? అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఐతే.. త్వరగా మత్తు వదిలిపోవాలంటే.. నీటితో వీలవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యంలో చాలా వరకు నీరే ఉంటుంది. కొద్దిగా ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఎంత శాతం ఉంది అనే దాన్ని బట్టీ, ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఐతే.. ఇథైల్ ఆల్కహాల్ స్వయంగా మత్తు కలిగించలేదు.
సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు.. ముందుగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఆహారం, రక్తంలో కలుస్తుంది. మద్యం విషయంలో ఇలా జరగదు. దీన్ని తాగినప్పుడు, జీర్ణం అవ్వాల్సిన పని లేకుండానే, కాసేపటికే రక్తంలో కలుస్తుంది.
రక్తంలో కలిసిన వెంటనే మద్యం.. శరీరంలోని కణ జాలాల్లోకి చాలా వేగంగా వెళ్తుంది. ఆ తర్వాత అది అసిటాల్డిహైడుగా మారుతుంది. ఇది చెడు వాసన కలిగివుంటుంది. అందుకే, మద్యం తాగిన వారి నుంచి చెడు వాసన వస్తూ ఉంటుంది. ఈ అసిటాల్డిహైడ్.. బ్రెయిన్ లోకి కూడా వెళ్తుంది. మెదడు కణాల్లో ఉన్న అమైనో యాసిడ్‌తో కలుస్తుంది. అప్పుడు బ్రెయిన్‌కి మత్తు వస్తుంది. (acetaldehyde)
అసిటాల్డిహైడ్ నీటిలో కరుగుతుంది. అందువల్ల, మద్యం తాగిన వారి మత్తు వదిలించేందుకు.. నిపుణుల పర్యవేక్షణలో, ముఖంపై నీరు చల్లవచ్చు. మత్తు మరీ ఎక్కువగా ఉంటే, నిపుణుల పర్యవేక్షణలో, ఓ బకెట్ నీళ్లు తెచ్చి, కుమ్మరించవచ్చు. దాంతో బట్టలు తడుస్తాయి. ఆ తడి చాలాసేపు ఉంటుంది. తడివల్ల.. చర్మ కణాల్లోని అసిటాల్డిహైడ్ నీటిలో కరుగుతుంది. దాంతో కొంత మత్తు వదిలిపోతుంది. అలాగే.. శరీరంలో వేడి కూడా తగ్గడం వల్ల, మత్తు ప్రభావం మరింత తగ్గుతుంది.
Note: Alcohol is injurious to health