సూర్యుడిలో డి విటమిన్ ఉంటుందా? అంటే.. ఉంటుంది కదా.. సూర్యుడి నుంచే D విటమిన్ వస్తుంది కదా.. అని మనం అనుకుంటాం. నిజమేంటంటే.. D విటమిన్ సూర్యుడి నుంచి రాదు. అది మనలో నుంచే వస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
ఫస్ట్ మనం డి విటమిన్ అంటే ఏంటో చూడాలి. ఎందుకంటే ఇది సింగిల్‌ది కాదు. కొన్ని కెమికల్స్‌ని కలిపి మనం డి విటమిన్ అని పిలుస్తున్నాం. విటమిన్ డి1, డి2, డి3, డి4, డి5 అనే ఐదు రకాల భిన్నమైన కెమికల్స్ అన్నింటినీ కలిపి డి విటమిన్ అని పిలుస్తారు.
మనం చెప్పుకున్న 5 కెమికల్స్‌లో D3 అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎండలో తిరిగినప్పుడు మన బాడీలో తయారయ్యేది ఇదే. అఫ్‌కోర్స్ క్షీరదాల బాడీలో కూడా ఇది తయారవుతుంది. D3ని సైంటిఫిక్‌గా కోలికాల్సిఫెరాల్ అని అంటారు.
Cholecalciferol
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని LDL కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన చర్మంలో కూడా ఉంటుంది. మనం ఎండలో తిరిగినప్పుడు.. LDL కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ D3 తయారవుతుంది. సూర్యుడిలోని అతినీలలోహిత కాంతి, మన చర్మంపై పడినప్పుడు విటమిన్ D3 తయారవుతుంది.
(Ultraviolet light)
మనం ఉదయం లేదా సాయంత్రం వేళ ఎండలో తిరిగితేనే, విటమిన్ D తయారవుతుందా? మధ్యాహ్నం వేళ తిరిగితే తయారవ్వదా? అనే డౌట్ కూడా మనకు ఉంటుంది. నిజానికి ఉదయం, సాయంత్రం కంటే.. మధ్యాహ్నం వేళ ఎండలో తిరిగితే.. ఎక్కువ విటమిన్ D తయారవుతుంది. ఎందుకంటే.. మధ్యాహ్నం సమయంలోనే సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణాలు ఎక్కువగా వస్తాయి. కానీ ఆ ఎండను మనం తట్టుకోలేం. అందుకే డాక్టర్లు ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్ చెయ్యమంటారు. ఆ వేడిలో కూడా మన బాడీలో డి విటమిన్ తయారవుతుంది.
విటమిన్ డి మనకు చాలా అవసరం. ఇది మన ఎముకల్ని గట్టిగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. డిప్రెషన్ తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. అన్నింటికీ మించి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఈ రోజుల్లో ఇండియన్స్‌లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని తగ్గించుకుంటే, ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.