స్మోకింగ్ ఈజ్ ఇన్జూరియస్ టు హెల్త్ అని తెలిసి, చాలా మంది పొగతాగడం తగ్గించారు. ఇప్పటికీ కొంతమంది స్మోక్ చేస్తున్నారు. ఆ అలవాటు నుంచి బయటపడాలంటే.. క్యాబేజీ తినడం మేలు. ఇది తెలియగానే,.. క్యాబేజీకీ, స్మోకింగ్‌కీ సంబంధమేంటి? అనే ప్రశ్న మనకు వస్తుంది. అదేంటో తెలుసుకుందాం.
క్యాబేజీ గురించి చెప్పుకుంటే.. ఇది గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఆకు కూర. దీన్ని కూరల్లో, సలాడ్లలో, ఫ్రైలలో ఇలా రకరకాలుగా వాడుతున్నాం. కొంతమంది పచ్చి క్యాబేజీని తింటారు. అలా తినకూడదు. ఎందుకంటే క్యాబేజీ ఆకులపై కంటికి కనిపించని, టేప్ వార్మ్ (Tapeworm) అనే పురుగు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఉంటే, కడుపులోకి వెళ్లి, అక్కడి నుంచి బ్రెయిన్ లోకి వెళ్లి.. బ్రెయిన్‌ని తింటూ, 25 మీటర్ల పొడవు పెరుగుతూ, ప్రాణం తియ్యగలదు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి, ఈ పురుగును చూడొచ్చు.
క్యాన్సర్‌ని అడ్డుకునే శక్తి క్యాబేజీకి ఉంది. అలాగే ఈ ఆకుకూరను తరచూ తింటూ ఉంటే, అధిక బరువును తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే విధంగా.. స్మోకింగ్ చేసేవారు.. రెగ్యులర్‌గా క్యాబేజీని తీసుకుంటే, వారిలో పొగ తాగే అలవాటు క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే పొగాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం, క్యాబేజీలో చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల క్యాబేజీ తిన్నవారికి.. పొగతాగాలి అని త్వరగా అనిపించదు, అని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ నికోటిన్ అనేది ఓ రకమైన మత్తు పదార్థం. ఇది శరీరంలోకి వెళ్లాక, బ్రెయిన్ నుంచి శరీరానికి సంకేతాలు వేగంగా వెళ్లేలా చేస్తుంది. అంటే.. వ్యక్తులు టెంపరరీగా యాక్టివ్ అయ్యేలా ఇది చేస్తుంది. ఐతే.. ఇది క్రమంగా వారి ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా దెబ్బతీస్తుంది. అందుకే స్మోకింగ్ చెయ్యొద్దు అంటారు. క్యాబేజీలో ఉండే నికోటిన్ చాలా తక్కువ శాతం కాబట్టి.. దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంతగా కనిపించవు. ఐతే.. క్యాబేజీ తినేవారు పూర్తిగా స్మోకింగ్ మానేస్తారని చెప్పలేం. స్మోకింగ్ మానేయాలని బలంగా డిసైడ్ అయితే, అప్పుడు క్యాబేజీ అవసరం లేకుండానే మానేయగలరు.